ఐదో టెస్టు భవితవ్యం మీరే తేల్చండి

ECB likely to write to ICC to decide on outcome of fifth Test - Sakshi

ఐసీసీకి లేఖ రాసిన ఈసీబీ

లండన్‌: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది. ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), బీసీసీఐల మధ్య ఈ టెస్టుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో సిరీస్‌ విజేతను నిర్ణయించే మాంచెస్టర్‌ టెస్టుపై తుది నిర్ణయం మీరే తీసుకోవాలంటూ ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ)కి ఈసీబీ లేఖ రాసింది. తమ జట్టు ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆడలేమంటూ టీమిండియా తప్పుకుంది. అయితే ఈ విషయం లో ఈసీబీ వాదన మరోలా ఉంది. భారత ఆటగాళ్లకు చేసిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చినా టెస్టులో ఆడటానికి వారు ఇష్టపడలేదని, అది వారి తప్పు కాబట్టి టెస్టులో టీమిండియా ఓడినట్లు అంగీకరించాలని పట్టుబడుతోంది. ఐసీసీ కూడా ఇదే తీర్పు ఇవ్వాలని కోరుకుంటుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top