Central Contract for 2022- 23: జాసన్‌ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు!

ECB announces Mens Central Contract for 2022 23 season - Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు 2022-23 సీజన్‌కుగానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌ పవర్‌ హిట్టర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌, బెన్‌ ఫోక్స్‌ తొలి సారి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌(ఫుల్‌టైమ్‌)ను పొందారు.

అదే విధంగా ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ తొలిసారి తన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్‌ గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్‌ చేయడం గమనార్హం.

ఇక ఈ సీజన్‌కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్‌ టైమ్‌కాంట్రాక్ట్‌ , ఆరుగురికి ఇంక్రిమెంట్‌ కాంట్రాక్ట్‌, మరో ఆరుగురుకి పేస్‌ బౌలింగ్‌ డెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ లభించింది. కాగా జాసన్‌ రాయ్‌తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్‌ కూడా తమ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. 

ఇంగ్లండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్స్‌:
మొయిన్ అలీ (వార్విక్‌షైర్‌), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్‌), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్‌స్టో (యార్క్‌షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్‌హామ్‌షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్‌) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్‌సెట్) లియామ్ లివింగ్‌స్టోన్ (లంకాషైర్‌) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్‌షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్‌షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్‌షైర్‌) మార్క్ వుడ్ (డర్హామ్).

ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు
హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), డేవిడ్ మలన్ (యార్క్‌షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్‌షైర్ 1 నవంబర్ 22 నుండి).

ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్‌షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్‌హామ్‌షైర్)

చదవండిT20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్‌.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top