CWC 2023 NED Vs ENG: నెదర్లాండ్స్‌పై విజయం.. ఖుషీలో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌, ఇంత మాత్రానికే..!

CWC 2023: England Climbs To Seventh Spot, Fans Happy After Their Team Defeating Netherlands - Sakshi

ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ముక్కీ మూలిగి రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పసికూన నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. ఈ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌ కాక బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లండ్‌.. నిన్న లభించిన చిన్నపాటి విజయానికే ఉబ్బితబ్బిబ్బైపోతుంది. నెదర్లాండ్స్‌పై విజయాన్ని ఇంగ్లండ్‌ అభిమానులు కూడా ఆస్వాధిస్తున్నారు.

ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ వారి ఖుషీకి కారణం వేరే ఉంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కు అర్హత సాధించాలంటే వరల్డ్‌కప్‌లో టాప్‌-7లో (లీగ్‌ దశ మ్యాచ్‌ల తర్వాత) ఉండాలని ఐసీసీ మెలిక పెట్టిన నేపథ్యంలో ఈ గెలుపు ఇంగ్లండ్‌కు అతి ముఖ్యమైంది.

ఇదే ఇంగ్లండ్‌కు, ఆ జట్టు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. నెదర్లాండ్స్‌పై గెలుపుతో ఇంగ్లండ్‌ ఏడో స్థానానికి వెళ్లడమే కాకుండా మెరుగైన రన్‌రేట్‌ సాధించి, ఆ స్థానానికి ఢోకా లేకుండా చేసుకుంది. దీంతో ఆ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కు అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న వరుస ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించనట్టే.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌.. నెదర్లాండ్స్‌పై కంటితుడుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు బెన్‌ స్టోక్స్‌ సెంచరీతో (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. మలాన్‌ (87), క్రిస్‌ వోక్స్‌ (51) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ ఛేదనలో చేతులెత్తేసి ఓటమిపాలైంది. ఆ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌ అలీ (3/42), ఆదిల్‌ రషీద్‌ (3/54) నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టారు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (41 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 12:52 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 9) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌, శ్రీలంక...
09-11-2023
Nov 09, 2023, 11:37 IST
వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫాక్స్‌ క్రికెట్‌ ఇవాళ (నవంబర్‌ 9) ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో...
09-11-2023
Nov 09, 2023, 11:07 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023కి సంబంధించి ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ తమ ఫేవరెట్‌ (వరల్డ్‌ ఎలెవెన్‌) జట్టును ప్రకటించింది. లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన...
09-11-2023
Nov 09, 2023, 09:00 IST
2023 వన్డే ప్రపంచకప్‌ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు....
09-11-2023
Nov 09, 2023, 07:46 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇవాళ (నవంబర్‌ 9) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 21:43 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న...
08-11-2023
Nov 08, 2023, 21:21 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 20:30 IST
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సత్తాచాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో గిల్‌...
08-11-2023
Nov 08, 2023, 20:25 IST
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్‌ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది....
08-11-2023
Nov 08, 2023, 19:17 IST
Angelo Mathews-  Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో...
08-11-2023
Nov 08, 2023, 17:51 IST
ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో...
08-11-2023
Nov 08, 2023, 17:13 IST
Ind vs Aus 2023 T20 Series: ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నేరుగా వీక్షించాలనుకున్న అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! టీ20 సిరీస్‌లో...
08-11-2023
Nov 08, 2023, 16:50 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 15:48 IST
గ్లెన్ మాక్స్‌వెల్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అఫ్గానిస్తాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన మాక్స్‌వెల్‌పై...
08-11-2023
Nov 08, 2023, 15:45 IST
CWC 2023- Glenn Maxwell- Pat Cummins: వరల్డ్‌కప్‌ టోర్నీలో 68 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు.. స్ట్రయిక్‌రేటు 17.65.....
08-11-2023
Nov 08, 2023, 14:26 IST
రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో...
08-11-2023
Nov 08, 2023, 13:41 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (నవంబర్‌ 8) నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత ఎడిషన్‌...
08-11-2023
Nov 08, 2023, 13:15 IST
క్రికెట్‌లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం...
08-11-2023
Nov 08, 2023, 12:20 IST
52 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ ఆస్ట్రేలియా ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌ను గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుత ప్రపంచకప్‌లో...
08-11-2023
Nov 08, 2023, 11:33 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర డబుల్‌ సెంచరీతో (128 బంతుల్లో 201...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top