ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ | CSK to miss Thalas services for 6 IPL 2026 games, return date revealed | Sakshi
Sakshi News home page

IPL 2026: ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Mar 29 2026 7:09 PM | Updated on Mar 29 2026 7:33 PM

CSK to miss Thalas services for 6 IPL 2026 games, return date revealed

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందే ఎంఎస్ ధోని రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో ధోని.. తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సీఎస్‌కే మేనెజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. 

అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎంఎస్ కోలుకోవడానికి నాలుగు నుంచి వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అయితే మిస్టర్ కూల్ ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం వరకు అందుబాటులో ఉండకపోవచ్చు అని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అంటే ధోని దాదాపు 6 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ధోని తిరిగి మళ్లీ ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ధోని స్ధానంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ధోనికే ఇదే ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌ అయ్యే అవకాశముంది. దీంతో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ధోనీ దూరమయ్యే మ్యాచ్‌లు ఇవే: రాజస్థాన్ రాయల్స్ (మార్చి 30), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 3), ఆర్సీబీ (ఏప్రిల్ 5), ఢిల్లీ క్యాపిటల్స్ (ఏప్రిల్ 11). కేకేఆర్‌(ఏప్రిల్‌ 14), ఎస్‌ఆర్‌హెచ్‌(ఏప్రిల్‌ 18)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement