కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతున్నారు..!  | Crores Of People Watching IPL 2023 On Star Sports | Sakshi
Sakshi News home page

కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతున్నారు.. కోహ్లి, ధోని బరిలోకి దిగితే..! 

May 9 2023 7:07 AM | Updated on May 9 2023 7:07 AM

Crores Of People Watching IPL 2023 On Star Sports - Sakshi

ముంబై: ఐపీఎల్‌కున్న క్రేజ్‌ ఏటికేడు పెరిగిపోతోంది. లీగ్‌పై కన్నేసే ప్రేక్షకులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మ్యాచ్‌ల్ని చూసేందుకు కోట్ల మంది టీవీలకు అతక్కుపోతున్నారు. ఈ సీజన్‌లో తొలి 38 మ్యాచ్‌లకుగాను 26 మ్యాచ్‌లని కనీసం 3 కోట్ల మందికి పైగా చూశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్, మాజీ చాంపియన్‌ చెన్నైల మధ్య ప్రారంభ పోరునైతే ఏకంగా 5.60 కోట్ల మంది వీక్షించినట్లు స్టార్‌ స్పోర్ట్స్‌ గణాంకాల ద్వారా తెలిసింది.

ధోని, కోహ్లిలు బరిలోకి దిగిన చెన్నై–బెంగళూరు, చెన్నై–కోల్‌కతా, చెన్నై–లక్నోల మధ్య జరిగిన మ్యాచ్‌లకు 5 కోట్ల మంది పైచిలుకు తిలకించారు. అయితే ఇవీ కేవలం టీవీ ప్రేక్షకులకు సంబంధించిన గణాంకాలే! ఎందుకంటే ‘జియో సినిమా’ యాప్‌లో చూసిన వారిని కలుపుకొంటే ఈ సంఖ్య ఇంకెన్ని కోట్లకు చేరుతుందో!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement