Cristiano Ronaldo Refuses To Take A Photo With Fan During UEL Clash, Video Viral - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: రొనాల్డో చేసిన పనికి యువతి మొహం మాడిపోయింది!

Sep 16 2022 12:36 PM | Updated on Sep 16 2022 1:12 PM

Cristiano Ronaldo Refuse Take Picture With Girl During Halftime UEL Clash - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటలో అతని విన్యాసాలు చూడాలని స్టేడియాలకు పోటెత్తుతుంటారు. అలా సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కలిగిన రొనాల్డోతో ఫోటో దిగాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి.

తాజాగా తను అభిమానించే ఆటగాడితో సెల్ఫీ దిగాలని ఆరాపడింది ఒక అందమైన యువతి. కానీ రొనాల్డో ఆమెతో ఫోటో దిగేందుకు నిరాకరించి చేతిని అడ్డుపెట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్‌ఏ యూరోప్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాంచెస్టర్‌ యునైటెడ్‌, మొల్డోవన్‌ క్లబ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ 2-0తో విజయం సాధించింది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున రొనాల్డో, జెడన్‌ సాంచోలు చెరో గోల్‌ కొట్టారు.

తొలి సగం ముగిసేసరికి రొనాల్డో కొట్టిన గోల్‌తో మాంచెస్టర్‌ యునైటెడ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి హాఫ్‌ బ్రేక్‌టైంలో కాస్త చికాకుగా ఉన్న రొనాల్డో పెవిలియన్‌కు వెళ్తున్నాడు. ఇంతలో అక్కడున్న ఒక యువతి రొనాల్డోతో ఫోటో దిగాలని ఆశపడింది. కానీ రొనాల్డో అందుకు అభ్యంతరం చెబుతూ తన చేతిని అడ్డుపెట్టి వెళ్లిపోయాడు. దాంతో యువతి మొహం చిన్నబోయింది. 

చదవండి: 'రిటైర్మెంట్‌ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'

ప్రైవేట్‌ లీగ్స్‌ మోజులో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement