James Neesham: ప్రైవేట్‌ లీగ్స్‌ మోజులో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్న ఆల్‌రౌండర్‌

All Rounder James Neesham Declines New Zealand Central Contract - Sakshi

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ కివీస్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. న్యూజిలాండ్‌ జట్టులోని టాప్‌ ఆటగాళ్లకు బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇస్తుంది. విదేశీ లీగ్స్‌తో జరిగిన ముందస్తుగా ఒప్పందం జరగడంతోనే కివీస్‌ బోర్డు అందించే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను వదులుకున్నట్లు నీషమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే నీషమ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్‌ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని బోర్డు స్పష్టం చేసింది.

ఇదే విషయాన్ని జేమ్స్‌ నీషమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పుకొచ్చాడు. ''సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకొని దేశం తరపున కాకుండా డబ్బు కోసం విదేశీ లీగ్స్‌ ఆడడంపై అందరూ నన్ను తప్పుబడతారని ఊహించగలను. కానీ జూలై వరకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చి ఉంటే కచ్చితంగా వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం నాకు శాపంగా మారింది.

ముందుగా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయంతో బోర్డు అందించే సెంట్రల్‌ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. బ్లాక్‌క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. అయితే భవిష్యత్తులో మాత్రం తోటి ఆటగాళ్లతో కలిసి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ తెలిపాడు.

ఇక జేమ్స్‌ నీషమ్‌ న్యూజిలాండ్‌ తరపున 12 టెస్టుల్లో 709 పరుగులు.. 14 వికెట్లు, 71 వన్డేల్లో 1409 పరుగులు.. 69 వికెట్లు, 48 టి20ల్లో 607 పరుగులు.. 25 వికెట్లు పడగొట్టాడు. నీషమ్‌ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉండడం విశేషం.

చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్ల పెద్ద మనసు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top