Cricket South Africa: స్మిత్, బౌచర్‌లపై విచారణ... నివేదికలో డివిలియర్స్‌ పేరు కూడా!

Cricket South Africa Probe On Graeme Smith Boucher Alleged Racism Claims - Sakshi

Racism In Cricket South Africa: ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారులపట్ల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు గ్రేమ్‌ స్మిత్, మార్క్‌ బౌచర్‌లపై సౌతాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) అధికారికంగా విచారణ ప్రారంభించనుంది. ప్రస్తుతం స్మిత్‌ సీఎస్‌ఏ డైరెక్టర్‌గా, బౌచర్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌లో జాతివివక్షకు సంబంధించి సోషల్‌ జస్టిస్‌ అండ్‌ నేషన్‌ బిల్డింగ్‌ (ఎస్‌జేఎన్‌) ఇటీవల ఇచ్చిన నివేదికలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు.

ఎస్‌జేఎన్‌ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై సీఎస్‌ఏ మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. నివేదికలో పై ఇద్దరితో పాటు ఏబీ డివిలియర్స్‌ పేరు కూడా ఉంది. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌ నిమిత్తం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఓవైపు సిరీస్‌ కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రస్తుత హెడ్‌కోచ్‌, డైరెక్టర్‌పై సీఎస్‌ఏ అధికారిక విచారణకు ఆదేశించడం గమనార్హం.

చదవండి: ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! 
IND VS SA: ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. క్రికెట్‌ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top