ఐపీఎల్ 2026 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఓటమితో ప్రారంభించింది. బ్యాటింగ్ బాగానే చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. అధిక ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌తో బౌలింగ్ చేయించకపోవడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ దీనికి సమాధానం క్రికెట్ ఆస్ట్రేలియానే దీనికి జవాబు చెప్పాలి అని తెలిపాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ ఓటమి అనంతరం స్పందించాడు.
‘ఇప్పుడు అంతా బాగానే ఉంది. మ్యాచ్ సమయంలో కాస్త కండరాలు పట్టేశాయనిపించింది. ప్రస్తుతం బాగానే ఉన్నా. ముంబై ఇండియ న్స్‌కు నిర్దేశించిన 220 ప్లస్ స్కోరు సరిపోతుందని భావించాము. మా వరకు మేము మెరుగ్గానే ఆడాం. బౌలింగ్ అనుకున్నంత స్ట్రాంగ్‌గా లేకపోవడం మాకు కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని అడ్డుకోవడం సవాల్‌తో కూడుకున్నది. ముజరబానికి ఇదే తొలి ఐపీఎల్ కావడం, అనుభవజ్ఞులు లేకపోవడం పెద్ద లోటు.
ఇక కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరాలు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఇద్దరు స్టార్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో ఓటమి తప్పలేదు. రూ. 25 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్‌తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం నేను కాదు క్రికెట్ ఆస్ట్రేలియానే చెప్పాలి.
అయితే ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కాస్త భిన్నశైలిని ఎంచుకున్నాం. బ్యాటింగ్‌లో ఇబ్బందులు లేనప్పటికీ రాబోయే మ్యాచ్‌ల్లో బౌలింగ్ యూనిట్‌ను మెరుగుపరుచుకుంటాం. 37 ఏళ్ల వయసున్నా నన్ను నేను ఇప్పటికీ ఒక కుర్రాడిలాగే భావించుకుంటా.’ అని చెప్పుకొచ్చాడు.
కేకేఆర్‌కు ముందే చెప్పాం: క్రికెట్ ఆస్ట్రేలియా
కాగా గ్రీన్ విషయంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే చేసిన కామెంట్స్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. ‘కొద్దికాలం కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కు దూరంగా ఉంటాడు. అతడు నడుంనొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల పాటు బౌలింగ్ చేయకూడదని సూచించాం. ఈ విషయం ఇప్పటికే కేకేఆర్‌తో చర్చించాం. గ్రీన్ పరిస్థితిపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని పేర్కొంది.


