పంత్‌ను పరామర్శించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు. ఆదివారం డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆస్పత్రికి వెళ్లిన పుష్కర్ సింగ్.. పంత్ ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్ల ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అదే విధంగా పెను ప్రమాదం నుంచి కాపాడిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
అతడు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా అతి తక్కువ కాలంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగిన పంత్‌ను పుష్కర్ సింగ్ సర్కార్ గతేడాది తమ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
చదవండి: Team india Schedule 2023: ఈ ఏడాదైనా భారత్‌కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే?
మరిన్ని వార్తలు :