WPL Auction: వేలంలో అత్యధిక ధర పలికిన టాప్‌-5 క్రికెటర్లు వీరే..

Check The Top 5 Most Expensive Buys At The Auction - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023 సంబంధించిన వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. 
స్మృతి మంధాన
ఈ వేలంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానకు జాక్‌పాట్‌ తగిలింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది.

ఆష్లీ గార్డనర్ 
ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్‌కు ఊహించని ధర దక్కింది. ఆమెను రూ. 3.20 కోట్లకు గుజరాత్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్‌గా గార్డనర్ నిలిచింది. అదే విధంగా  వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గార్డనర్‌ నిలిచింది.
నాట్ స్కివర్
ఇంగ్లండ్‌కు చెందిన స్టార్‌ ఆల్‌ రౌండర్‌ నాట్ స్కివర్‌పై కూడా కాసుల వర్షం కురిసింది. ఈ వేలంలో స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు  ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్‌గా గార్డనర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచింది. 
దీప్తి శర్మ
భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్‌ వారియర్జ్‌ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్‌ వారియర్జ్‌ తమ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.
జెమీమా రోడ్రిగ్స్
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌  జెమీమా రోడ్రిగ్స్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది.  ఇప్పటి వరకు 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోడ్రిగ్స్ 13 అర్ధసెంచరీలు చేసింది.
చదవండి: WPL Auction: లేడీ సెహ్వాగ్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top