సౌరవ్‌ గంగూలీకి షాక్‌.. కోల్‌కతా హైకోర్టు జరిమానా

Calcutta High Court Fined To BCCI President Sourav Ganguly - Sakshi

స్థలం కేటాయింపు విషయంలో ద్విసభ్య ధర్మాసనం ఆదేశం

ప్రభుత్వంతోపాటు, హిడ్కోకు కూడా జరిమానా

కలకత్తా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి షాక్‌ తగిలింది.కోల్‌కతా హైకోర్టు జరిమానా గంగూలీకి ఓ స్థలం కేటాయింపు విషయంలో జరిమానా విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలో ఓ పాఠశాల భవనం నిర్మాణం కోసం గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో ద్విసభ్య న్యాయస్థానం విచారణ చేపట్టింది. అది వాస్తవమేనని తేల్చి ధర్మాసనం రూ. 10 వేల జరిమానా విధించింది. కేటాయింపు చేసిన హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హిడ్కో)తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది.

చదవండి: మహిళ పోలీస్‌ అధికారి బాత్రూమ్‌లో కెమెరా.. స్నానం చేస్తుండగా..
చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్‌ భర్త కేసు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top