వారెవ్వా అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో | Brilliant Direct Hit From Shreyas Iyer David Warner Is Run Out | Sakshi
Sakshi News home page

వారెవ్వా అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో

Nov 29 2020 11:47 AM | Updated on Nov 29 2020 2:03 PM

Brilliant Direct Hit From Shreyas Iyer David Warner Is Run Out - Sakshi

సిడ్నీ : టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ మరో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఆసీస్‌ 36 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్‌ స్మిత్ 60 , లబుషేన్‌ 27 పరుగులతో కొనసాగుతున్నారు. ఇదిలాఉండగా.. మొదటి వన్డేలో అర్థసెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ వార్నర్‌ రెండో వన్డేలోనూ అదే జోరు కనబరిచాడు.

వరుసగా రెండో అర్థసెంచరీ సాధించిన వార్నర్‌ ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలోనే 77 బంతుల్లో 83 పరుగులు చేసిన వార్నర్‌ శ్రేయాస్ అయ్యర్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో షాట్‌ ఆడిన స్మిత్‌ లాంగాన్‌ మీదుగా షాట్‌ ఆడాడు. మొదటి పరుగు వేగంగా పూర్తి చేసిన వార్నర్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించగా అప్పటికే అయ్యర్‌ చేతికి చిక్కిన బంతిని త్రోగా విసరడంతో నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్‌ 156 పరుగుల వద్ద కీలకమైన వార్నర్‌ వికెట్‌ను కోల్పోగా.. భారత్‌కు రెండో వికెట్‌ దక్కింది. అయ్యర్‌ వార్నర్‌ను రనౌట్‌ చేసిన తీరును ఐసీసీ ట్విటర్‌లో పంచుకుంది.  అయ్యర్‌ త్రోను పొగుడుతూ 'వారెవ్వా అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. (చదవండి : 'బాబర్‌ అజమ్‌ నన్ను నమ్మించి మోసం చేశాడు')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement