ఏషియన్‌ గేమ్స్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌.. భారత బాక్సింగ్‌ జట్టుతో పాటు రైల్వే కోచ్ దుర్గా ప్రసాద్ | Boxing Coach Durga Prasad From Telangana Going To China With Asian Games Boxing Team For Preparation Training | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌.. భారత బాక్సింగ్‌ జట్టుతో పాటు రైల్వే కోచ్ దుర్గా ప్రసాద్

Published Mon, Sep 4 2023 8:14 PM | Last Updated on Mon, Sep 4 2023 8:18 PM

Boxing Coach Durga Prasad From Telangana Going To China With Asian Games Boxing Team For Preparation Training - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనాలోని వుయిషాన్‌ నగరంలో సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు (17 రోజులు) జరిగే ఏషియన్‌ గేమ్స్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌కు తెలంగాణ బాక్సింగ్‌ కోచ్‌ దుర్గా ప్రసాద్ నామినేట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ నగరంలోని ఓల్డ్‌ సిటీకి చెందిన దుర్గా ప్రసాద్ భారత బాక్సింగ్‌ జట్టుతో పాటు చైనాకు వెళ్లనున్నాడు.

ఈ శిక్షణా శిబిరంలో మొత్తం 46 మంది పాల్గొననున్నారు. ఇందులో 26 మంది బాక్సర్లు (పురుషులు, మహిళలు) కాగా.. 9 మంది కోచ్‌లు, 11 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. కాగా, 2023 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement