Boxer Sachin Siwach makes winning start on World Championships debut - Sakshi
Sakshi News home page

World Boxing Championships: ప్రిక్వార్టర్స్‌లో సచిన్‌ 

May 9 2023 7:41 AM | Updated on May 9 2023 11:44 AM

Boxer Sachin Siwach Makes Winning Start On World Championships Debut - Sakshi

తాష్కెంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్‌ సివాచ్‌ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్‌ కుమార్‌ (92 కేజీలు), గోవింద్‌ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయారు.

తొలి రౌండ్‌ బౌట్‌లో ప్రపంచ మాజీ యూత్‌ చాంపియన్‌ సచిన్‌ 5–0తో సెర్గీ నొవాక్‌ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్‌ 0–5తో రేయస్‌ (స్పెయిన్‌) చేతిలో... గోవింద్‌ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్‌ (జార్జియా) చేతిలో ఓడిపోయారు.    

Advertisement
 
Advertisement
Advertisement