ICC-BCCI: ఐసీసీ ఆదాయంలో మన వాటా 38.5 శాతం!

BCCI is projected to earn 230m dollars in next ICC revenue cycle: Reports - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఆదాయం, వాటాలపరంగా ‘బిగ్‌ 3’ శాసిస్తూ వచ్చాయి. ఐసీసీ ఆర్జన నుంచి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దాదాపు సమాన వాటా పొందాయి. అయితే ఇకపై ఇది ‘బిగ్‌ 1’గా మాత్రమే ఉండనుంది! తాజాగా ప్రతిపాదించిన కొత్త లెక్క ప్రకారం వచ్చే నాలుగేళ్ల కాలానికి (2024–27) ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38.5 శాతం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖాతాలోకే చేరనుంది.

ప్రసార హక్కులు, వాణిజ్యపరమైన ఒప్పందాల ద్వారా సంవత్సర కాలానికి ఐసీసీ 600 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 4,917 కోట్ల) ఆర్జించే అవకాశం ఉండగా... ప్రతీ ఏటా భారత్‌కు 231 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,893 కోట్లు) లభిస్తాయి.

ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్‌ 6.89 శాతం (సుమారు రూ. 339 కోట్లు), మూడో స్థానంలో ఉన్న ఆ్రస్టేలియాకు 6.25 శాతం (సుమారు రూ. 308 కోట్లు) మాత్రమే దక్కనున్నాయి. ఓవరాల్‌గా 88.81 శాతం ఆదాయం ఐసీసీ పూర్తి స్థాయి సభ్యులైన 12 జట్లకు చేరనుండగా, అసోసియేట్‌ జట్ల కోసం 11.19 శాతం మొత్తం కేటాయించనున్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top