Ban Vs Pak: బంగ్లాదేశ్‌కు వరుస షాకులు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం.. మరో కీలక ఆటగాడు సైతం

Ban Vs Pak: Shakib Al Hasan To Miss 1st Test Tamim Iqbal Ruled Out Of NZ Series - Sakshi

Ban Vs Pak: Shakib Al Hasan To Miss 1st Test Tamim Iqbal Ruled Out Of NZ Series: పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ సందర్భంగా గాయపడిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు మొదటి టెస్టుకు దూరం కానుండగా.. రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్‌తో స్వదేశంలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురై టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌... పర్యాటక జట్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే.

ఇక నవంబరు 26 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తుండగా.. షకీబ్‌ వంటి స్టార్‌ ఆటగాడు దూరం కావడం లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ సెలక్టర్‌ మిన్హాజుల్‌ అబెదిన్‌ మాట్లాడుతూ... ‘‘తొలి టెస్టులో షకీబ్‌ ఆడటం లేదు. గాయం(తొడ కండరాల నొప్పి) నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిజియోథెరపిస్ట్‌ రిపోర్టు ఇచ్చిన తర్వాతే... తను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయంపై స్పష్టత ఇవ్వగలము’’ అని చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉండగా.. మరో సీనియర్‌ ప్లేయర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సైతం బొటనవేలి గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఎవరెస్టు ప్రీమియర్‌ లీగ్‌(సెప్టెంబరు- అక్టోబరు) సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఇక పాకిస్తాన్‌తో పాటు... న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సైతం అతడు అందుబాటులో ఉండటం లేదు. ఇక ఇప్పుడు పాక్‌తో సిరీస్‌కు షకీబ్‌ దూరం కావడంతో వరుస షాకులు తగినట్లయింది.

పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు బంగ్లాదేశ్‌ ప్రకటించిన జట్టు ఇదే:
మొమినుల్‌ హక్‌(కెప్టెన్‌). షాద్‌మన్‌ ఇస్లాం, సైఫ్‌ హసన​, నజ్ముల్‌ హుసేన్‌ షాంటో, ముష్పికర్‌ రహీమ్‌, లిటన్‌ కుమార్‌ దాస్‌, నురుల్‌ హసన్‌ సొహాన్‌, మెహది హసన్‌ మిరాజ్‌, నయీం హసన్‌, తైజుల్‌ ఇస్లాం, ఇబాదత్‌ హుసేన్‌ చౌదరి, అబు జాయేద్‌ చౌదరి రహీ, యాసిర్‌ అలీ రబ్బీ, మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, రేజూర్‌ రహమాన​ రాజా.

చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్‌.. గాయంతో కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top