వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు బజరంగ్‌ దూరం

Bajrang Punia Skip Wrestling World Championships October Ligament Tear - Sakshi

ఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత వరల్డ్‌ బజరంగ్‌ పూనియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్‌కు ముందే అతనికి ఈ గాయం కాగా, అలాగే ఆటను కొనసాగించిన బజరంగ్‌  ఇప్పుడు చికిత్స కోసం విరామం తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అక్టోబర్‌ 2 నుంచి నార్వేలో జరిగే టోర్నీ దూరమయ్యాడు.

క్వార్టర్స్‌లో సానియా జోడీ 
క్లీవ్‌లాండ్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జోడీ క్లీవ్‌లాండ్‌ చాంపియన్‌íÙప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సానియా–క్రిస్టీనా మెక్‌హెల్‌ (అమెరికా) జంట 6–3, 6–2తో ఒక్సాన కలష్నికొవా (జార్జియా) – ఆండ్రీ మితు (రొమేనియా) జోడిపై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌–అమెరికా ద్వయం ఆధిపత్యమే కొనసాగింది. రెండు సెట్లలోనూ ఎక్కడ ప్రత్యరి్థకి అవకాశం ఇవ్వకుండా సానియా జోడీ చెలరేగింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top