కరోనా: పాట్‌ కమిన్స్‌ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన

Australian cricketer Pat Cummins contributes  usd 50k to PM Cares Fund - Sakshi

భారత్‌కు  ఆసీస్‌ క్రికెటర్‌ 50 వేల డాలర్ల సాయం 

ఆక్సిజన్‌ కొనుగోలు చేసేందుకు పీఎం కేర్స్‌ ఫండ్‌కు డొనేషన్‌

మిగిలిన అందరూ కూడా స్పందించండి : పాట్‌ కమిన్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో  ఆక్సిజన్‌ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్‌  ఈ నిర్ణయం తీసుకున్నారు. తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలన్నారు.  ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు.

అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీల్‌ కొనసాగించడం సరియైనదా కాదా అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్‌డౌన్‌లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీల్‌ మ్యాచ్‌లు కాస్త సంతోషానిస్తాయన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్‌ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు. ఈ మేరకు  కమిన్స్‌ ఒక ప్రకటన విడుదల చేశాడు.

కాగా, 2021 ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవ‌లం 34 బంతుల్లోనే క‌మిన్స్ 66 ప‌రుగులు చేసి కొత్త చరిత్రను రాశాడు. ఇలా ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్లో 30, అంత‌కంటే ఎక్కువ ప‌రుగులు చేసిన వారిలో క‌మిన్స్ ఆరోవాడుగా నిలిచిన సంగతి తెలిసిందే. 

చదవండికోవిడ్‌ సంక్షోభం: సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top