కోవిడ్‌ సంక్షోభం: సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం

Microsoft Google CEOs to help India  Covid-19 crisis deepens - Sakshi

చాలా వేదనగా ఉంది : ఐటీ దిగ్గజాలు స్పందన

భారత్‌కు సహాయం అందించేందు  సన్నద్ధం

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్  కొనుగోలుకు మద్దతు : సత్య  నాదెళ్ల

రూ. 130కోట్ల సాయం:  సుందర్‌ పిచాయ్‌

సాక్షి,న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్‌ దిగ్గజాలు స్పందించారు.  మైక్రోసాఫ్ట్‌ సీఈవో  సత్య నాదెళ్ల, అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌  భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు. రోజులకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలోముఖ్యంగా  తీవ్ర ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి  ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రయవుతున్నకోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్‌ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు   సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్తాయిలో 3.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు కాగా 2812 మరణాలు నమోదైనాయి. మొత్తం 2,19,272 బాధితులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్‌, నిత్యావసర మందుల సరఫరా కొరత  నేపథ్యంలో బ్రిటన్‌, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్‌ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌లు, 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు,   ఇతర వైద్య సామాగ్రితో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top