Australia line in for SHOCK inclusion of Matthew Kuhnemann in SQUAD - Sakshi
Sakshi News home page

BGT 2022: టీమిండియాతో రెండో టెస్ట్‌.. కొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్న ఆసీస్‌

Feb 12 2023 10:22 AM | Updated on Feb 12 2023 2:40 PM

Australia line in for SHOCK inclusion of Matthew Kuhnemann in SQUAD - Sakshi

నాగ్‌పూర్‌ టెస్టులో భారత్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియా.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు తమ జట్టులో అదనంగా మరో స్పిన్నర్‌ చేర్చుకోవాలని ఆస్ట్రేలియా జట్టు మెనేజెమెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో యువ స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ను భారత్‌కు పంపాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ​కాగా తొలి టెస్టులో భారత స్పిన్నర్లకు ఆసీస్‌ బ్యాటర్లు విలవిల్లాడిన సంగతి తెలిసిందే.

అయితే అరుణ్ జైట్లీ స్టేడియం కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో నాథన్‌ లియాన్‌, టాడ్‌ మర్ఫీ, మిచెల్‌ స్వెప్సన్‌, ఆష్టన్‌ అగర్‌ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.

అయితే దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న అన్‌క్యాప్డ్‌ స్పిన్నర్‌ కుహ్నెమన్‌ను ఐదో స్పిన్నర్‌గా జట్టులోకి చేర్చాలని ఆస్ట్రేలియా సెలక్టర్లు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో కుహ్నెమన్‌ భారత గడ్డపై అడుగు పెట్టే అవకాశం ఉంది.  భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆష్టన్‌ అగర్‌(లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మర్ఫీ(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), మాథ్యూ రేన్షా, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌(రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), డేవిడ్‌ వార్నర్‌,మాథ్యూ కుహ్నెమన్‌
చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే: రోహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement