AUS Vs ENG: కళ్లు చెదిరే విన్యాసం.. క్యాచ్‌ పట్టకపోయినా సంచలనమే

AUS Vs ENG: Ashton Agar CRAZY Save At Boundary Stop Sixer Goes Viral - Sakshi

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ కళ్లు చెదిరే విన్యాసం అందరిని ఆకట్టుకుంది. క్యాచ్‌ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్యాచ్‌ మిస్‌ అయినప్పటికి అతని విన్యాసం మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే సిక్సర్‌ వెళ్లాల్సిన బంతిని కేవలం ఒక్క పరుగుకే పరిమితం చేసి ఐదు పరుగులు సేవ్‌ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు. 

ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో అప్పటికే సెంచరీతో దుమ్మురేపుతున్న డేవిడ్‌ మలాన్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. చాలా హైట్‌లో వెళ్లిన బంతి వెళ్లడంతో కచ్చితంగా సిక్స్‌ అని అభిప్రాయపడ్డారు. కానీ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఆస్టన్‌ అగర్‌  సూపర్‌మ్యాన్‌లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు.

అయితే అప్పటికే బౌండరీ లైన్‌ దాటేయడంతో క్యాచ్‌ పట్టినా ఉపయోగముండదు. అందుకే బంతిని వెంటనే బౌండరీ లైన్‌ అవతలకు విసిరేసిన తర్వాతే కిందపడ్డాడు. అలా ఆరు పరుగులు రావాల్సింది పోయి ఇంగ్లండ్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆస్టన్‌ అగర్‌ విన్యాసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా అంతకముందు లియామ్‌ డాసన్‌ను కూడా ఆస్టన్‌ అగర్‌ తన స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. 

ఇక డేవిడ్‌ మలాన్‌ సెంచరీతో(128 బంతుల్లో 134 పరుగులు, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్‌ విల్లీ(34 నాటౌట్‌), జాస్‌ బట్లర్‌(29 పరుగులు) మలాన్‌కు సహకరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌, స్టోయినిస్‌ చెరొక వికెట్‌ తీశారు.  

చదవండి: చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు

స్టార్క్‌ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్‌ వీడియో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top