Asia Cup Hockey: 16 గోల్స్‌తో టీమిండియా హాకీ జట్టు కొత్త చరిత్ర.. సూపర్‌ 4కు అర్హత

Asia Cup Hockey: India Mens Beat Indonesia 16-0 Qualify For Super 4 - Sakshi

ఆసియా కప్‌ హాకీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు జూలు విదిల్చింది. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఏకంగా 16-0 తో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు సూపర్‌-4కు అర్హత సాధించింది. టీమిండియా తరపున డిస్పన్‌ టిర్కీ 4 గోల్స్‌ కొట్టగా.. సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిశాడు.  సెల్వం, పవన్‌, వెటరన్‌ ఆటగాడు ఎస్‌వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇక పురుషుల ఆసియా హాకీ కప్‌ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

కాగా ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్‌ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో ఓడి సూపర్‌-4 అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్‌ కొడితే గాని భారత్‌కు సూపర్‌-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది. అదే సమయంలో జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ కూడా ఓటమి పాలవ్వాలి.

ఇక్కడే మనకు అదృష్టం కలిసొచ్చింది. జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓటమి చెందడం.. ఇండోనేషియాతో​ మ్యాచ్‌లో అనుకున్నదానికంటే ఒక గోల్‌ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్‌ విక్టరీ అందుకొని సూపర్‌-4లో అడుగుపెట్టింది. కాగా జపాన్‌ చేతిలో ఓటమితో 2023 హాకీ వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్‌ అర్హత సాధించలేకపోయింది. అదే సమయంలో జపాన్‌, కొరియా మలేషియాలు 2023 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. మరోవైపు 2023 హాకీ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో ఆతిథ్య హోదాలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది.

చదవండి: Barbora Krejcikova: 'మోస్ట్‌ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి డిఫెండింగ్ చాంపియన్‌ ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top