Viral Video: England Spinner Jack Leach Gives Autograph On Fan Bald Head - Sakshi
Sakshi News home page

Ashes: అరె ఏంట్రా ఇది.. అభిమాని గుండుపై క్రికెటర్‌ ఆటోగ్రాఫ్‌.. వీడియో వైరల్‌

Jan 6 2022 4:38 PM | Updated on Jan 6 2022 4:59 PM

Ashes: Viral Video England Spinner Jack Leach Gives Autograph On Fan Bald Head - Sakshi

PC: 7 Cricket

Ashes: అరె ఏంట్రా ఇది.. అభిమాని గుండుపై క్రికెటర్‌ ఆటోగ్రాఫ్‌.. వీడియో వైరల్‌

వెర్రి వేయి రకాలు అంటారు... మనం చెప్పుకోబోయే ఓ వీరాభిమానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుని.. ఇంగ్లండ్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ను ఆటోగ్రాఫ్‌ ఇవ్వాల్సిందిగా ఓ అభిమాని కోరాడు.

తన గుండుపై సంతకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జాక్‌ లీచ్‌ చకాచకా వచ్చి ఆటోగ్రాఫ్‌ ఇచ్చేసి వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న ప్రేక్షకులు ముందు ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు. తొలి రోజు ఆటలో భాగంగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరె ఏంట్రా ఇది... గుండుపై ఆటోగ్రాఫ్‌.. ఏంటో నీ పిచ్చి అభిమానం’’ అంటూ ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. కాగా మొదటి రోజు ఆటకు వరణుడు పదే పదే ఆటంకం కలిగించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా  416 పరుగుల వద్ద ఆతిథ్య ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది.

చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్‌
IND Vs SA 2nd Test Day 3: మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్‌ అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement