క్రికెటర్లకు ఆనంద్‌ మహేంద్ర ఊహించని గిఫ్ట్‌ | Anand Mahindra anounce SUV Cars gifts to Six Indian Cricketers | Sakshi
Sakshi News home page

క్రికెటర్లకు ఆనంద్‌ మహేంద్ర ఊహించని గిఫ్ట్‌

Jan 23 2021 2:48 PM | Updated on Jan 23 2021 5:59 PM

Anand Mahindra anounce SUV Cars gifts to Six Indian Cricketers  - Sakshi

తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. టెస్ట్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్‌యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్‌ మహేంద్ర ట్వీట్‌ చేశారు.

ఆస్ట్రేలియాలో అదరగొట్టిన క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రోత్సహించే వారిలో మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర ముందుంటారు. టెస్ట్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్‌యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్‌ మహేంద్ర ట్వీట్‌ చేశారు.

ఆస్ట్రేలియా టెస్ట్‌ (బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌)తో అరంగేట్రం చేసిన శార్దూల్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవ్‌దీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌లకు తమ కంపెనీకి చెందిన థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని శనివారం ఆనంద్‌ మహేంద్ర ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్‌ మహేంద్ర ప్రశంసించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement