Amit Mishra Mistakenly Hails India for "Test Series Win" - Sakshi
Sakshi News home page

IND Vs SA: "ఏంటి మిశ్రా మత్తులో ఉన్నావా.. ఇది తొలి టెస్ట్‌ మాత్రమే"

Dec 31 2021 1:40 PM | Updated on Dec 31 2021 4:17 PM

Amit Mishra mistakenly Tweet India Wins Test Series - Sakshi

సెంచూరియాన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్‌ ఆటగాడు అమిత్‌ మిశ్రా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. అయితే అక్కడే మిశ్రా పప్పులో కాలేశాడు. "విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. చారిత్రత్మక విజయం సాధించి తొలి టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్నందుకు గర్వంగా ఉంది" అని మిశ్రా ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఇంకేమి ఉంది ఇక్కడే మిశ్రా నెటిజన్లుకు దొరికిపోయాడు. మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసిన మిశ్రాని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. "ఏంటి మిశ్రా మత్తులో ఉండి ట్వీట్‌ చేశావా" అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఇలా తప్పుగా ట్వీట్‌ చేయడం మిశ్రా ఇదేం కొత్త కాదు. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌-2021 విజేత న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశాడు.
చదవండిVirat Kohli- Vamika: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడు వామిక.. ఆ సంతోషం వెలకట్టలేనిది’.. వీడియో వైరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement