source: X
అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 329 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హసన్ (82), ముష్ఫికర్ రహీం (81) అర్ద సెంచరీలతో రాణించారు. లిటన్ దాస్ (5), మెహిది హసన్ మిరాజ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహ్మత్ షా (105 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీతో ఆఫ్ఘన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా, షా పట్టుదలగా బ్యాటింగ్ చేసి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో షాతో పాటు ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (62) మాత్రమే రాణించాడు. బంగ్లా పేసర్ హసన్ మహ్ముద్ హ్యాట్రిక్ సహా 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. అతడికి ఎబాదత్ హొసేన్ (4-56), మెహిది హసన్ మిరాజ్ (1-41) కూడా సహకరించారు. వీరి ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది. షద్మాన్ (67), తంజిద్ హసన్ (83), లిటన్ దాస్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 4 వికెట్లతో రాణించాడు.
ఇదీ చదవండి: సూపర్ సెంచరీ.. విరాట్, గిల్ సరసన ఆఫ్ఘన్ బ్యాటర్


