source: X
18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్
అభిషేక్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 87-1గా ఉంది. అభిషేక్ 54, ఇషాన్ కిషన్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఆదిలోనే భారత్‌కు షాక్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 7 పరుగుల వద్దనే సంజూ శాంసన్ (3) ఔటయ్యాడు. షమార్ జోసఫ్ బౌలింగ్‌లో కమిల్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం భారత్, వెస్టిండీస్ తలో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. విండీస్ తరఫున రొమారియో షెపర్డ్, అకీల్ హొసేన్ స్థానాల్లో క్వెంటిన్ శాంసన్, కీమో పాల్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, క్వెంటన్ శాంసన్, గుడాకేష్ మోటీ, షమర్ స్ప్రింగర్, కీమో పాల్, షమర్ జోసెఫ్
ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన రింకూ సింగ్


