చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్‌ | 1st Time In 19 Seasons, Jofra Archer Scripts Unique IPL Record vs KKR | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్‌

Apr 20 2026 1:32 PM | Updated on Apr 20 2026 1:37 PM

1st Time In 19 Seasons, Jofra Archer Scripts Unique IPL Record vs KKR

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) రాత్రి కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఓ చారిత్రక ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఆర్చర్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో అర్చర్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే టిమ్‌ సీఫర్డ్‌ వికెట్‌ తీశాడు. దీనికి ముందు రెండు మ్యాచ్‌ల్లో ఇదే తరహాలో ఇన్నింగ్స్‌ తొలి బంతులకే ఆర్సీబీ ఫిల్‌ సాల్ట్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ అభిషేక్‌ శర్మను ఔట్‌ చేశాడు. కేవలం 10 రోజుల్లోనే అభిషేక్‌ ఈ ఘనత సాధించడం మరో విశేషం.

టిమ్‌ సీఫర్ట్‌ వికెట్‌తో ఆర్చర్‌ మరో ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా (5 వికెట్లు) మొహమ్మద్‌ షమీ సరసన నిలిచాడు. ఆర్చర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్‌ సాల్ట్‌, అభిషేక్‌ శర్మ, టిమ్‌ సీఫర్ట్‌ను ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్ చేశాడు.

ఈ రికార్డు విభాగంలో షమీ, ఆర్చర్‌ తర్వాతి స్థానాల్లో ట్రెంట్‌ బౌల్ట్‌, ఉమేశ్‌ యాదవ్‌, లసిత్‌ మలింగ, భువనేశ్వర్‌ కుమార్‌, పాట్‌ కమిన్స్‌ ఉన్నారు. వీరంతా తలో మూడు సార్లు ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్లు తీశారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్‌ 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్‌ (39) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుణ్‌ చక్రవర్తి, కార్తీక్‌ త్యాగి తలో 3.. సునీల్‌ నరైన్‌ 2 వికెట్లు తీసి రాయల్స్‌ ఆటగాళ్లను కట్టడి చేశారు.

అనంతరం​ ఛేదనలో కేకేఆర్‌ సైతం తడబడినా.. రింకూ సింగ్‌ (53 నాటౌట్‌), అనుకూల్‌ చౌదరి (29 నాటౌట్‌) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్‌ తొలి విజయాన్ని అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement