యూట్యూబ్‌లో భారత కుర్రాళ్ల హవా

YouTubers Race To The Top  See Pandemic As A Trigger - Sakshi

ఇప్పుడంతా డిజిట‌ల్ హ‌వా న‌డుస్తోంది. మ‌రీ ముఖ్యంగా లాక్‌డౌన్‌తో చాలామంది యూట్యూబ్‌లో స‌త్తా చాటుతున్నారు. ఓ నివేదిక ప్ర‌కారం యువ‌త రోజుకు స‌గ‌టున 25% స‌మ‌యాన్ని ఆన్‌లైన్‌లో కంటెంట్ కోసం వెచ్చిస్తున్నార‌ట. ఇది వ‌ర‌కు అయితే యూట్యూబ్‌లో పాపులారిటీ తెచ్చుకొని స్టార్లు అయ్యేవారు. ఇప్పుడు స్టార్లు సైతం యూట్యూబ్ బాట ప‌ట్టారు. ల‌క్ష‌ల్లో వ్యూస్, వేల‌ల్లో స‌బ్‌స్రైబర్ల‌తో కంటెంట్ క్రియేటర్స్‌గా మారి యూట్యూబ్‌లోనూ హ‌వా చాటుతున్నారు.  కాలానికి త‌గ్గ‌ట్లు మ‌న‌మూ మారాలి. టెక్నాల‌జిని అందిపుచ్చుకొని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏది అవ‌స‌ర‌మో ఆ కంటెంట్‌ను రెడీ చేసుకోవాలి. లేదంటే అవుట్‌డేట్ అయిపోతాం. స‌రిగ్గా ఈ సూత్రాల‌నే పాటిస్తూ ప్ర‌ముఖుల‌ను సైతం స‌బ్‌స్రైబ‌ర్లుగా మ‌లుచుకుంటున్నారు కొంద‌రు యూట్యూబ్ స్టార్స్. అంతేకాకుండా క్రియేవిటీతో ల‌క్ష‌ల్లో సంపాదిస్తూ మిలియ‌నీర్లుగానూ చ‌లామ‌ణి అవుతున్న ఇండియ‌న్ టాప్ యూట్యూబ్ స్టార్ల గురించి సాక్షి ప్ర‌త్యేక క‌థ‌నం

అజే నాగర్ అనే 21 ఏళ్ల  కంటెంట్ క్రియేట‌ర్ టిక్‌టాక్  వ‌ర్స‌స్ యూట్యూబ్ అనే ఒక్క‌ వీడియో  రూపొందించి అప్ప‌టివ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. క్యారీమినాటి పేరుతో ఛానెల్ న‌డుపుతూ అత్య‌ధికంగా 24 మిలియ‌న్ స‌బ్‌స్రైబ‌ర్ల‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో అగ్ర‌గామిగా నిలిచాడు. పాఠ‌శాల విద్య‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసినా ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక యూట్యూబ్ స‌బ్‌స్రైబ‌ర్లు ఉన్న స్వీడిష్ యూట్యూబర్ ప్యూడీపీతో స‌రిస‌మానంగా స‌త్తా చాటుతున్నాడు. 5 ఏళ్ల క్రిత‌మే ఛానల్‌ను ప్రారంభించి అతి త‌క్కువ టైంలోనే వ‌ర‌ల్డ్ రికార్డుల‌తో పోటీప‌డుతున్నాడు.

🙋🏼‍♂️

A post shared by 𝑨𝒋𝒆𝒚 𝑵𝒂𝒈𝒂𝒓 (@carryminati) on

2018 గ్లోబ‌ల్ టాప్ 10 వీడియో లిస్ట్‌లో అమిత్ భ‌దానా క్రియేట్ చేసిన కంటెంట్ కూడా ఒక‌టి. 20 మిలియ‌న్ స‌బ్‌స్రైబ‌ర్ల‌తో యూట్యూబ్‌లో ప్ర‌స్తుతం రెండో స్థానంలో చెలామ‌ణి అవుతున్నాడు ఈ 21 సంవ‌త్స‌రాల కుర్రాడు. మూడేళ్ల క్రితం కామెడీ స్కెచ్ వీడియోల‌తో ప్ర‌స్తానం మొద‌లుపెట్టి ఇప్ప‌డు స్టార్స్‌తోనూ వీడియోలు చేస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పోగేసుకున్నాడు. వీళ్ల‌తో పాటు ఆశిష్ చంచ‌లాని, భువ‌న్ బామ్ లాంటి కంటెంట్ క్రియేట‌ర్లు కూడా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెబ్‌సిరీస్‌లోనూ ఆశిష్ న‌టించాడు. టెక్నాల‌జీ గురూజీ పేరుతో ఛాన‌ల్ ప్రారంభించిన గౌరవ్ చౌదరి ఫోర్బ్స్అండర్ 30 జాబితాలో చోటు  ద‌క్కించుకొని ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 

 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top