రెండు శునకాల బెలూన్‌ ఆట.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

Two Dogs Play With balloon On Beach Video Viral On Social Media - Sakshi

సాధారణంగా శునకాలు వీధుల్లో కనిపించే పాడైపోయిన బొమ్మలు, ప్లాస్టిక్‌కవర్లు, వస్తువులతో ఆడుకుంటాయి. ఒకదానికొకటి పోటీపడి మరీ లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అచ్చం అలాంటి ఓ వీడయో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘ఏ పేజీ తో మేక్‌ యూ స్మైల్ అగైన్’ అనే ట్విటర్‌ ఖాతా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ‘మీ అందరికీ ఒకక్షణం శాంతి, మీ సాయంత్రానికి కొంత ప్రశాంతతను ఈ వీడియో కలిగిస్తుందని ఆశిస్తున్నాం’ అని అంటూ కామెంట్‌ జతచేసింది. సముద్ర తీరంలో రెండు కుక్కలు ఓ బెలూన్‌ను తమ తలతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పైపైకి తోస్తాయి.

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు బంతిని తమ తలతో కొట్టినట్లు శునకాలు కూడా ఆ బెలూన్‌కు వాటి తలతో కొట్టడంతో అది పైకి ఎగురుతుంది. బెలూన్‌ను పైకి తోసుకుంటూ సముద్రం నీటిలోకి వెళ్లుతాయి. సూర్యుడు అస్తమిస్తున్న అందమైన సాయంకాలం సమయంలో సముద్ర తీరంలో కుక్కలు బెలూన్‌తో సరదాగా ఆడుకుంటున్న వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది.  ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది నెటిజన్లు వీక్షించగా వేల సంఖ్యలో కామెంట్లు  చేస్తున్నారు. ‘చాలా అద్భుతంగా ఉంది’, ‘ఇలాంటి వీడియోలు చూస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది’, ‘ఈ వీడియోను అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఉయ్యాలపై వృద్దుడి స్టంట్‌.. నెటిజన్లు ఫిదా!

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top