● కలెక్టర్ హైమావతి ● క్యాంపు కార్యాలయంలోని ఫామ్‌పాండ్ సందర్శన
సిద్దిపేటరూరల్: వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతగా అమలు చేయాలని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జలసిరి పనుల్లో భాగంగా నిర్మించిన ఫామ్‌పాండ్, రూఫ్‌వాటర్ హార్వేస్టింగ్ స్ట్రక్చర్స్‌ను శనివారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు చేరి దాదాపు మూడు అడుగుల మేర నీరు ఫామ్‌పాండ్‌లో నిలించిందన్నారు. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్టక్చర్ దాదాపు పూర్తయిందని చెప్పా రు. ప్రతీ గ్రామంలోని ఇంటింటికీ ఇంకుడుగుంత, పంటకుంట, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలపాలన్నారు.
గెజిటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గెజిటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి పనులపై ఏంపీడీఓ, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ జూమ్ సమావేశం నిర్వహించారు.నీ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరిశీలించిన పత్రాలను వెంటనే కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీబీజీరామ్‌జీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచితే చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రమేశ్, హౌసింగ్ భగవంత్‌రావు, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదు
కొండపాక(గజ్వేల్): వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. కొండపాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడం ముఖ్యమన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబల కుండా ఆయా గ్రామాల సిబ్బందిని అలర్ట్ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతీవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతకు ముందు మహాత్మా జ్యోతిబా పూలె బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తున్నారా? లేదా విషయాన్ని పరిశీలించారు.


