వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శనివారం మూల మహోత్సవంతో అలరారింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో తెల్లవారు జామున అర్చక వేదపండితులు మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం చేశారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, సర్వాభరణాలతో కమనీయంగా అలంకరించారు. భక్తజన సామూహిక లక్షపుష్పార్చన, యాగశాలలో చండీ హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
వస్త్రాలు పరిశీలించి..
ఆసక్తిగా తిలకించి
దుబ్బాక: చేనేత సహకార సొసైటీని స్టడీ టూర్‌లో భాగంగా పట్టణంలోని పీఎంశ్రీ జెడ్పీజీహెచ్‌ఎస్ విద్యార్థినులు శనివారం సందర్శించారు. నేతన్నలు మగ్గాలపై నేస్తున్న రంగు రంగుల చీరలు, టవల్స్‌తో పాటు కండెలపై దారం చుట్టడం తదితర చేనేత కళలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వస్త్రాల తయారీ, నేతన్నల కష్టం, నైపుణ్యతను చేనేత సొసైటీ చైర్మన్ అంకం మధు విద్యార్థులకు వివరించారు. చేనేత కళలను కాపాడుకునేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భూపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆక్రమిత భూములను మాకివ్వండి
అదనపు కలెక్టర్‌కు
మల్లన్నసాగర్ నిర్వాసితుల వినతి
గజ్వేల్‌రూరల్: రాజకీయ నాయకులు అక్రమించిన భూములను ముంపు గ్రామాల రైతులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ల సామర్థ్యాలను గత ప్రభుత్వంలో ఇష్టారీతిన పెంచి పరిహారాలు ఇవ్వకుండానే పోలీసులతో తమల్ని బయటకు పంపించివేశారని తెలిపారు. ముంపు బాధితులకు పరిహారాల కింద భూమికి భూమి ఇవ్వాలని పలుమార్లు వినతుల ద్వారా కోరామన్నారు. అక్రమంగా పొందిన భూములను తమకు ఇప్పించే విధంగా చూడాలని కోరుతున్నామన్నారు.
అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు
సిద్దిపేటజోన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో సెలక్షన్ ప్రక్రియ జరిగింది. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికల, యువతీ యువకులకు ఎంపిక నిర్వహించారు. వివిధ అంశాల్లో పోటీలు, ఎంపిక జరిగింది. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వామి పర్యవేక్షించారు.
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటజోన్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లను శనివారం అధికారులు పరిశీలించారు. సిద్దిపే ట ఆర్డీఓ సదానందం, ఏసీపీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ హరికిరణ్‌లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మౌలిక వసతుల ఏర్పాట్లు గూర్చి అరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


