నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం తెచ్చిన జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాంకేతిక విద్యను స్కిల్ యూనివర్సిటిలో విలీనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులను సాంకేతిక విద్య నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. నిరుపేద విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉన్నందున జీఓను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలల ఐఖ్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు అద్యాపకులు నల్లబ్రాడ్జీలు దరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలో అధ్యాపకుల నిరసన


