మిరుదొడ్డి(దుబ్బాక): సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాయడంతోపాటు కవితలు, కథల ద్వారా సాహిత్య రంగంలో తన దైన ముద్రవేస్తున్న అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రానికి చెందిన రచయిత్రి రేణుక (శశిరేఖ) రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభను చాటుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడ మీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొ ని ప్రతిభను చాటారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.


