అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలంలోని కట్కూర్, దుబ్బతండా, దాసుతండా, చాపగానీతండా, కన్నారం, పంతుల్‌తండా గ్రామాల్లో సోమవారం రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నట్లు ఎంపీడీఓ బానోతు జయరాం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘పల్లె పల్లెకు పొన్నమన్న– పల్లె పల్లెలో ప్రజాపాలన’కార్యక్రమంలో భాగంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మంత్రి పర్యటన కొనసాగుతుందని తెలిపారు.
పెన్షన్ మంజూరు చేయండి
తహసీల్దారుకు బాధితురాలు వినతి
బెజ్జంకి(సిద్దిపేట): తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న తనను ఒంటరి మహిళగా గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని మండలంలోని గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన పడిగల జ్యోతి కోరారు. బాధితురాలు తాను తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన పత్రాన్ని ఆదివారం విలేకరులకు చూపిస్తూ మాట్లాడారు. తనకు ఒక కిడ్నీ చెడిపోయిందని, థైరాయిడ్, మహిళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిపారు. తాను తల్లిదండ్రుల వద్దనే ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువపత్రం ఇవ్వనందున గడువులోపు పెన్షన్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.
బైక్ ర్యాలీకి
భారీగా తరలిరావాలి
నంగునూరు(సిద్దిపేట): ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హలో మాదిగ, చలో సిద్దిపేట బైక్ ర్యాలీకి భారీగా తరలిరావాలని ఎమ్మార్పీ ఎస్ టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రాజేందర్ పిలుపునిచ్చారు. నంగునూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 3న సిద్దిపేటలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు బైక్‌ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
దేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి
హుస్నాబాద్‌రూరల్: గ్రామ దేవతలను పూజించటం తెలంగాణ సంస్కృతిలో భాగమని మా జీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠకు ఆయన హాజరై మాట్లాడారు. రైతులు విత్తనాలు వేసిన తర్వాత పంటల దిగుబడులు రావాలని ప్రకృతికి పూజలు చేస్తే కరుణించి వర్షాలు కురుపిస్తుందని ప్రజల నమ్మకమన్నారు. మన సంస్కృతి, చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని చెప్పారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్


