గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: జిల్లాలను కుదిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు యఽథాతథంగా కొనసాగుతాయన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని ఈ అంశంపై దుష్పప్రచారం చేస్తున్నారని వాపోయారు. మరోవైపు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిరాధార ఆరోపణలను ప్రచారం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి పాత్ర గొప్పదని, అలాంటి నాయకునిపై తప్పుడు ప్రచారం సహించరానిదన్నారు.


