ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కేడం లింగమూర్తి
హుస్నాబాద్: తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక వడ్డే ఓబన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. తెలంగాణ వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లింగమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఓబన్న అని కొనియాడారు. ప్రతీ ఊరికి మంచి నీటి బావులు, రాజుల కోటలు, చెరువుల నిర్మాణాలు వడ్డెర సోదరుల శ్రమ ఫలితమేనన్నారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధుడు ఓబన్న అని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జేఏసీ నియో జకవర్గ కో ఆర్డినేటర్ వీరన్న యాదవ్, వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): క్రీడల్లో గెలుపోటములు సహజమని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపుకోసం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మండల పరిధి అంతక్కపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా భవిష్యత్తులో మరింత కృషి చేయాలన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, సర్పంచ్ సృజన్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): డెమోక్రటిక్ టీచర్చ్ ఫ్రంట్ జిల్లా శాఖను బలోపేతం చేద్దామని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిష్టయ్య, లింగారెడ్డిలు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జిల్లా పరిధిలోని మండలాల్లో ఎన్నికలు నిర్వహించి, సభ్యత్వ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకులు తిరుపతిరెడ్డి, రాములు, చంద్రబాబు, మల్లయ్య, ప్రభాకర్‌రెడ్డి, మనీష్‌కుమార్, రాజయ్య, వెంకటరమణరెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
నాచగిరిలో
భక్తుల కిటకిట
వర్గల్ (గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వర్గాలు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి


