ఆకట్టుకున్న రంగవల్లులు
గజ్వేల్: మండల పరిధి ఆహ్మదీపూర్‌లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. 200మందికిపైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు శైలజ, మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్ భవానీ, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నపూర్ణ, సర్పంచ్ ప్రభాకర్ పాల్గొని మహిళలను అభినంధించారు. ఈ సందర్భంగా గెలు పొందిన వారికి బహుమతులను అందజేశారు. కాగా పోటీలో ప్రతి ఒక్కరికీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌లు గిఫ్ట్‌లు అందజేశారు.


