పండక్కి.. బస్సెక్కి..
బస్టాండ్లలో సంక్రాంతి సందడి
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. – కొమురవెల్లి(సిద్దిపేట)
ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్న వారితో జిల్లాలోని బస్టాండ్‌లు సందడిగా మారాయి. ఆదివారం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్.. ప్రయాణికులతో ఇలా కిటకిటలాడింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
పండక్కి.. బస్సెక్కి..


