మళ్లీ వర్షం.. రైతుల పరేషాన్
దుబ్బాకతోపాటు పలుగ్రామాల్లో వర్షం
దుబ్బాక: ఇప్పటికే వర్షాలకు ధాన్యం తడిసిపోయి అవస్థలు పడుతోన్న రైతుల పరిస్థితి తాజా వర్షంతో మూలిగేనక్కమీద తాటిపండు పడ్డటైంది. దుబ్బాక,చెల్లాపూర్,రాజక్కపేట, రఘోత్తంపల్లి,రామక్కపేట,ఆకారం, లచ్చపేట, ధర్మాజీపేటతోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కూడా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మళ్లీ తడిసిపోయింది. ఇప్పటికే ధాన్యం తడిసి మొలకలు రావడం, వరదల్లో కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. తమ వడ్లు తడిసిపోవడంతో ఆ నీళ్లను తొలగించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. వర్షాలకు వడ్లు తడిసిపోవడంతో మ్యాచర్‌రాక కొనుగోలు ప్రక్రియ సైతం మందకొడిగా సాగుతుండటంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేకుంటే ఈ వర్షాలకు చేతికిరాకుండా పోతుందంటూ రైతులు వాపోతున్నారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పోరుబాట పట్టనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికయిన వంగ మహేందర్‌రెడ్డి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు మూడు నెలల్లోపు చెల్లిస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. డిసెంబర్ 9లోపు హామీలు నెరవేర్చకుంటే పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పత్రిక సంపాదక వర్గ సభ్యురాలు లక్కిరెడ్డి విజయ, శుభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌మావో
చేర్యాల(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లలో విధించిన ఆంక్షలు తొలగించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధి వీరన్నపేట శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా.. ఆంక్షలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పత్తి అమ్మాలంటే యాప్‌లో నమోదు చేయాలని, ఎకరాకు 7క్వింటాళ్ల వరకు మాత్రమే సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తా మని నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సిరెడ్డి, ధర్మారెడ్డి, సంపత్, మల్లయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇటీవల మెదక్, తూప్రాన్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి అండర్–14 వాలీబాల్ బాలికల జట్టుకు 9వ తరగతి విద్యార్థినులు అఖిల, శ్రీజ, వైష్ణవి సెలక్ట్ అయ్యారు. అండర్–17 రబ్బి జట్టుకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎన్. వందన, 9వ తరగతి విద్యార్థులు నందిని, సారిక, జిమ్నాస్టిక్స్ రాష్ట్రస్థాయికి మొదటి సంవత్సరం విద్యార్థిని వందన ఎంపికై ంది. జిల్లాస్థాయి అండర్ 17 అథ్లెటిక్స్‌కు 9వ తరగతి విద్యార్థిని హర్షిని 1,500 మీటర్ల పోటీలో గెలుపొందింది. ఎంపికై న విద్యార్థులను మంగళవారం ప్రిన్సిపాల్ లలితాదేవి, పీడీ సాలి, అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు.
మళ్లీ వర్షం.. రైతుల పరేషాన్
మళ్లీ వర్షం.. రైతుల పరేషాన్


