రంజాన్ వేడుకలకు సిద్ధం
మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు జిల్లాలోని ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లింలు తమ కుంటుబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బెజ్జంకికి వ్యవసాయ
కళాశాల మంజూరు
బెజ్జంకి(సిద్దిపేట): మండలానికి గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల మంజూరైనట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహిస్తున్న ఈ కళాశాలను బెజ్జంకి మండలానికి మార్చుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నందన్నారు. వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ వెస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అలరించిన కుస్తీ పోటీలు
కల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్‌ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు.
సంతాప ర్యాలీ
సంగారెడ్డి జోన్: ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతిర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో యూసీఎఫ్ అధ్యక్షుడు రూబెన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుమోహన్, జనరల్ సెక్రటరీ సునీల్ జయ కుమార్ పాల్గొన్నారు.
రంజాన్ వేడుకలకు సిద్ధం
రంజాన్ వేడుకలకు సిద్ధం


