.......... | - | Sakshi
Sakshi News home page

............

Aug 8 2024 8:08 AM | Updated on Aug 8 2024 11:00 AM

No Headline

No Headline

ప్రస్తుతం సాగు వివరాలు

పంటల ఎకరాలు

వరి 1,63,341

పత్తి 94,269

మొక్కజొన్న 21,024

కంది 4,163

ఇతర 23,113

సాధారణంగా వరి నాట్లు ఆగస్టు మొదటి వారం వరకు పూర్తి అవుతాయి. ఈ సారి వర్షాలు ఎక్కువగా కురవకపోవడంతో నారు పోసినా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల నారు ముదిరిపోయింది. గతేడాది వానకాలంలో 5,20,690 ఎకరాలు సాగైతే ఇప్పటి వరకు 3,05,910 ఎకరాలు మాత్రమే సాగు అవుతోంది. గతేదాడి వరి 3,79,108 ఎకరాలు సాగు అయితే ఇప్పటి వరకు 1,63,341 ఎకరాలే సాగు అయినట్లు సమాచారం. గతంతో పోలిస్తే సుమారు 2లక్షల ఎకరాల మేర తక్కువగా సాగవుతుంది. ఇంకా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

పలు మండలాల్లో లోటు వర్షపాతం

జిల్లాలో ఇప్పటి వరకు సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసింది. పలు మండలాల్లో లోటు, సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం వర్గల్‌, ములుగు, మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, కొమురవెల్లిలలో నమోదు కాగా, సాధారణ వర్షపాతం హుస్నాబాద్‌, దుబ్బాక, సిద్దిపేట అర్బన్‌, దౌల్తాబాద్‌, రాయపోలు, గజ్వేల్‌, కొండపాక, చేర్యాలలో నమోదైంది. అలాగే అధిక వర్షపాతం సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూరు, బెజ్జంకి, కోహెడ, అక్కన్నపేట, నంగనూరు, తొగుట, మిరుదొడ్డి, మద్దూరు, దూల్మిట్ట, నారాయణరావుపేట, అక్బర్‌పేట భూంపల్లి, కుకునూరుపల్లిలలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో చెరువులను నింపే అవకాశం ఉండటంతో మరో 15 రోజుల్లో సాగు పెరిగే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement