మత సామరస్యానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక

Aug 28 2026 7:15 AM | Updated on Aug 28 2026 7:15 AM

12 ఏళ్లుగా హిందూ సోదరుడికి రాఖీ కడుతున్న ముస్లిం మహిళ

12 ఏళ్లుగా హిందూ సోదరుడికి రాఖీ కడుతున్న ముస్లిం మహిళ

జహీరాబాద్‌ టౌన్‌: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కులం, మతం, రక్త సంబంధం అనే పరిమితులు లేవని నిరూపిస్త్తోంది ఓ ముస్లిం సోదరి. మత సామరస్యానికి ఆమె ఆదర్శంగా నిలుస్తోంది. జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డిపల్లికి చెందిన నాగరాజు(గ్రామ పాలన అధికారి) శాంతినగర్‌కు చెందిన ఎండీ కుద్దుస్‌ ఇద్దరూ మంచి మిత్రులు. అయితే కొన్నేళ్ల క్రితం అనుకోకుండా కుద్దూస్‌ మరణించాడు. ఆయన సోదరి షహీన్‌బేగం నాగరాజును సొంత అన్నలా భావించి 12 ఏళ్లుగా ప్రతి రాఖీ పౌర్ణమికి వచ్చి రాఖీ కడుతుంది. ఏటా రాఖీ పండుగకు ప్రత్యేకంగా జహీరాబాద్‌కు వచ్చి నాగరాజుకు రాఖీ కట్టి కట్టడం ఆనవాయితీగా మార్చుకుంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు.. వారు కూడా నాగరాజుకు రాఖీ కడుతున్నారు. మతాల హద్దులు చెరిపేసి, అనుబంధమే మిన్న అని చాటుతున్న వీరిని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement