నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బచ్చురాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుంచు స్వామి (24) ఉపాధి కోసం హైదరాబాద్‌లో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై వాహనం నడుపుతూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వామిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన బాపని బంజరపల్లికి చెందిన పర్సు ఐలయ్య(58) తొగుట మండలం బండారుపల్లిలో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రేషన్ కార్డు తీసుకొని తన ద్విచక్ర వాహనంపై బండారుపల్లికి వస్తుండగా మార్గమధ్యలో కొల్గూరు శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.


