చేగుంట(తూప్రాన్): మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రామాయంపేట సీఐ సైదా కేసు వివరాలు వెల్లడించారు. మాసాయిపేట మండల చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండేది. ఆరు నెలల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్ రాంవీర్‌సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కాగా రాంవీర్‌సింగ్, మున్నీ కలిసినప్పుడల్లా డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో మున్నీని చంపాలనే ఉద్దేశంతో ఈనెల 14న కూరగాయలు అమ్మడానికి మల్కాజిగిరికి వెళ్లిన ఆమెను మాసాయిపేట శివారులోని లేబై సమీపంలోకి రాంవీర్‌సింగ్ ఫోన్ చేసి పిలిపించాడు. ఈ క్రమంలో మున్నీకి మద్యం తాగించి కొట్టి పడేసి ఆమైపెకి లారీ ఎక్కించి చంపేసి పరారయ్యాడు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


