మెదక్ కలెక్టరేట్: బీడీ కార్మికులు, వృద్ధుల దరఖాస్తులు స్వీకరించి వారికి పెన్షన్లు మంజూరు చేయా లని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం చేయూత పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వాటి జాబితాలో బీడీ కార్మికులు, వృద్ధులతోపాటు అన్ని రకాల దివ్యాంగుల పేర్లు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, బాలమణి, పార్టీ సభ్యులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.


