అంతర్జాతీయ భాగస్వామ్యంతో పరిశోధనలు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ భాగస్వామ్యంతో పరిశోధనలు

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

కావేరి వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రావు

వర్సిటీని సందర్శించిన బ్రెజిల్‌ విద్యావేత్త డాక్టర్‌ ఫ్లావియో మైడెరోస్‌

వర్గల్‌(గజ్వేల్‌): బ్రెజిల్‌లోని లావ్రాస్‌, కావేరి వర్సిటీల మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచస్థాయి అవకాశాలతోపాటు, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత బలం చేకూరుతుందని కావేరి వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం లావ్రాస్‌ ఫెడరల్‌ యూనివర్సిటీ (యూఎఫ్‌ఎల్‌ఏ) ప్లాంట్‌ పాథాలజీ విభాగం ప్రొఫెసర్‌, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్లావియో మైడెరోస్‌ గౌరారంలోని కావేరి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వీసీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయంలోని ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన క్షేత్రాలు, సమగ్ర పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. విద్యా, పరిశోధన సదుపాయాలు అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థుల మొబిలిటీ కార్యక్రమాలు, విద్యాపరమైన సహకారం, పరిశోధనలు, అవుట్‌రీచ్‌ కార్యక్రమాలు, అధ్యాపకుల అభివృద్ధి తదితర రంగాల్లో రెండు వర్సిటీల పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బీ.శ్రీనివాసులు, డీన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వారితో అంతర్జాతీయ విద్య, పరిశోధన, అకాడమిక్‌ సహకార అవకాశాల పై విస్తృతంగా చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement