పవర్ వర్సెస్ ఫారెస్ట్‌శాఖ
హవేళిఘణాపూర్(మెదక్): చెట్ల కొమ్మలను తొలగించే విషయం విద్యుత్, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మండల పరిధిలోని జక్కన్నపేట– బూర్గుపల్లికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను శనివారం విద్యుత్‌శాఖ అధికారులు నరికివేస్తుండగా, తమ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారంటూ అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.


