నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడికి రిమాండ్‌

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

దుబ్బాకటౌన్‌: అన్నపై దాడి చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం రాయపోల్‌ మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాయపోల్‌ ఎస్‌ఐ కె.మానస కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తిప్పుగొని మహేశ్‌ గౌడ్‌ అతని తమ్ముడు శ్రీకాంత్‌ మధ్య ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం నెలకొంది. ఈ క్రమంలో మే 29న ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన శ్రీకాంత్‌, మహేశ్‌పై కట్టెతో దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement